Tuesday, 15 November 2016

ఆస్కార్ ను గెలిచిన జాకీచాన్

ఆస్కార్ ను గెలిచిన జాకీచాన్

                     
                             ఇరవై మూడేల్ల క్రితం హాలీవుడ్ కథానాయకుడు సిల్వెస్టర్ స్టాలోన్ ఇంట్లో ఆస్కార్ పురస్కార ప్రతిమను చుశారు జాకీచాన్, జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్ పురస్కారం అందుకోవాలన్న కోరిక ఆయనకు కలిగింది. అది నెరవేరడానికి సుదీర్ఘ కాలమే ఎదురుచూడాల్సి వచ్చింది. చైనీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జాకీచాన్ కు ఆస్కార్ గౌరవ పురస్కారం లభించింది. లాస్ ఏంజెల్స్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించారు జాకీ చాన్ . ఈ సందర్బంగా ఆయన తన ఆనందాన్ని పంచుకుంటూ "సినీ పరిశ్రమలో 56 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత, 200కు పైగా సినిమాలు చేరిన తర్వాత, ఎన్నోసార్లు ఎముకలు విరకొట్టుకున్నాక ఆఖరికి ఆస్కార్ దక్కింది " అన్నారు. .ఇంతకుమును తన తల్లిదండ్రులతో కలియు చాల సార్లు ఆస్కార్ వేడుక చూశానని, 'ఇన్ని సినిమాలు చేసినా నీకు ఆస్కార్ పురస్కారం ఎందుకు రాలేదు? ' అని తన తండ్రి అడిగేవారని చెప్పారు జాకీ. ఒక అనుకునే స్థాయికి చేరడానికి తన అభిమానులే కారణమన్నారు జాకీ. "సినిమాలు చేసినా, కిటికీల్లో నుంచి దూకినా, ఫైట్లు చేసి ఎముకలు విరకొట్టుకున్న అదంతా అభిమానుల కోసమే" అన్నారు జాకీచాన్. చైనీస్ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం గర్వాంగా ఉందని, మినుకు తన స్వస్థలం హాంకాంగ్ కు ధన్యవాదాలని జాకీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిల్వెస్టర్ స్టాలోన్, టామ్ హన్స్, నికోల్ కిడ్మన్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment